Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కల్కి' ట్రైలర్ విడుద‌ల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..!

Kalki 2898 AD Trailer out on June 10th
Advertisement
  • జూన్ 10వ తేదీన మూవీ ట్రైల‌ర్ రిలీజ్
  • ఈ మేర‌కు చిత్రం యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న‌
  • ఈ నెల 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న 'కల్కి 2898 ఏడీ'
  • నాగ్ అశ్విన్ దర్శకత్వం.. వైజయంతి మూవీస్ నిర్మాణం
Advertisement
రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన గ్లింప్స్, పోస్టర్స్, యానిమేషన్ సిరీస్, బుజ్జి వెహికల్ ఇలా మూవీపై భారీ అంచనాలను నెల‌కొల్పాయి. హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రం ఉండబోతుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

ఇక ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ఈ నెల 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. దీంతో సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో ట్రైలర్ విడుదల తారీఖును మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. జూన్ 10వ తేదీన మూవీ ట్రైల‌ర్‌ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా చిత్రం యూనిట్‌ ప్రకటించింది. కాగా, ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ముంబైలో జరగనుంద‌ని స‌మాచారం. 

టాలీవుడ్‌ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై కే. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, విశ్వ‌న‌టుడు కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు.
Advertisement
Advertisement
Kalki 2898 AD
Kalki 2898 AD Trailer
Prabhas
Nag Ashwin
Tollywood

More Telugu News